హెచ్‌పీసీఎల్ విశాఖ రిఫైనరీ విస్తరణకు లైన్ క్లియర్

18 Jan, 2016 00:26 IST|Sakshi
హెచ్‌పీసీఎల్ విశాఖ రిఫైనరీ విస్తరణకు లైన్ క్లియర్

పర్యావరణ శాఖ అనుమతులు..
 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం రిఫైనరీ విస్తరణ కోసం ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌పీసీఎల్‌కు షరతులతో కూడిన పర్యావరణ అనుమతి లభించింది. 8.33 మిలియన్ టన్నుల వార్షిక  సామర్థ్యం ఉన్న ఈ రిఫైనరీని రూ.18,400 కోట్ల పెట్టుబడులతో 15మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్న రిఫైనరీగా విస్తరించాలని హెచ్‌పీసీఎల్ యోచిస్తోంది. గత నెలలో జరిగిన పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ(ఈఏసీ) సమావేశంలో  ఈ రిఫైనరీ విస్తరణకు ఆమోదం లభించింది. విశాఖలో కొన్ని ప్రాంతాల్లో పారిశ్రామిక విస్తరణపై నిషేధం ఉన్నదన్న కారణంగా ఈ రిఫైనరీ విస్తరణ ప్రతిపాదనను 2013లో తిరస్కరించారు. గత ఏడాది జనవరి 26న ఆంధ్రప్రదేశ కాలుష్య నియంత్రణ బోర్డ్ ఆధ్వర్యంలో జరిగిన జనవిచారణ(పబ్లిక్ హియరింగ్)లో వెల్లడైన వివిధ అంశాలపై ఈఏసీ చర్చించింది.  కంపెనీ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్),  ప్లాంట్ పరిసరాల్లో యాక్సిడెంట్లు, ట్రాఫిక్, పర్యావరణ కాలుష్యాలు, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు, స్థానికులకు ఉద్యోగవకాశాలు, నీటి సరఫరా తదితర అంశాలకు హెచ్‌పీసీఎల్ కంపెనీ సంతృప్తికరంగా సమాధానాలిచ్చిందని ఈఏసీ వెల్లడించింది.

సీఎస్‌ఆర్ కింద రూ.60 కోట్లు కేటాయించాలని, కొన్ని పనులకు కాలపరిమితితో కూడిన చర్యలు తీసుకోవాలని నిర్దేశిస్తూ ఈ రిఫైనరీ విస్తరణకు ఈఏసీ పచ్చజెండా ఊపింది.  కాగా హిందూస్తాన్ పెట్రో కెమికల్స్(హెచ్‌పీసీఎల్)కు ముంబైలో ఒకటి, విశాఖలో ఒకటి మొత్తం రెండు రిఫైనరీలు ఉన్నాయి. ముంబైలో ఉన్న 7.5 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 9.5 మిలయన్ టన్నులకు పెంచుకోవాలని కూడా హెచ్‌పీసీఎల్ ప్రతిపాదిస్తోంది. దీనికి సంబంధించి పబ్లిక్ హియరింగ్ జరపాలని, వెల్లడైన విషయాలను, అభ్యంతరాలపై కంపెనీ తన వ్యాఖ్యలను కూడా జతపరచి పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఈఏసీ ఆదేశించింది.
 
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లి కర్కశత్వం

ఆ ర్యాంకింగ్స్‌లో కేరళ టాప్‌..!

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

‘నేను శక్తి’ వేడుకలు

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

టుడే న్యూస్ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం

వసూళ్లు పెరిగాయి

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు