బాకీ పేరుతో కుమార్తె నిర్బంధం

23 Dec, 2015 02:58 IST|Sakshi

హెచ్చార్సీకి తండ్రి ఫిర్యాదు
హైదరాబాద్: బాకీ పేరుతో తన కుమార్తెను నిర్బంధంలో ఉంచిన వీడీబీ కంపెనీ కాంట్రాక్టర్, మేస్త్రీలపై చర్యలు తీసుకోవాలంటూ ఓ తండ్రి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యా దు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ఏనుగొండ కు చెందిన చీరుపు వెంకటయ్య నెల్లూరు జిల్లాలో జరిగే ఎన్‌హెచ్-5 రోడ్డు విస్తరణ పనులకు భార్య రాములమ్మ, కుమార్తె అరుణ(22)లను 2014, సెప్టెంబర్ 9న తీసుకెళ్లాడు. ప్రాజెక్టు మేస్త్రీ దేవయ్య దగ్గర అడ్వాన్స్ తీసుకుని 2015, ఆగస్టు 11 వరకు పనిచేశారు.

అయితే తామింకా బాకీ ఉన్నామని వీడీబీ కంపెనీ వారు, మేస్త్రీ దేవయ్య.. తన కుమార్తెను నెల్లూరు జిల్లా ఎన్‌హెచ్-5 ప్రాజెక్టు సైట్ ఆఫీ సులో బంధించారని వెంకటయ్య తెలిపాడు. అందుకే హెచ్చార్సీని ఆశ్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. స్పందించిన హెచ్చార్సీ ఫిబ్రవరి 22లోగా నివేదికను అందజేయాలని నెల్లూరు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు