‘వన్‌టైమ్’కు భారీ స్పందన

20 Oct, 2015 03:10 IST|Sakshi
‘వన్‌టైమ్’కు భారీ స్పందన

టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో  5.83 లక్షల మంది రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చేపట్టిన ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)’కు భారీ స్పందన వస్తోంది. కమిషన్ వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకుంటున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీనికి ఇప్పటివరకు 5,83,839 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర సర్వీసు కమిషన్‌లో లేని విధంగా ‘ఓటీఆర్’ విధానాన్ని టీఎస్‌పీఎస్సీ తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
 
 వివిధ ఉద్యోగ పరీక్షలకు సంబంధించి సిలబస్ ప్రకటన, పలు పోస్టుల నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నేపథ్యంలో ఈ వెబ్‌సైట్లో  రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ గా ఉన్నారు. పురుషులు 3,93,947 మంది, మహిళలు 1,89,892 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక కీలకమైన గ్రూప్స్ పరీక్షల నోటిఫికేషన్లు జారీ ప్రారంభమైతే ఇది మరింత పెరుగుతుందని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు.
 
 హైదరాబాద్ నుంచి అత ్యధికం..:
 ఓటీఆర్ చేసుకున్న వారిలో హైదరాబాద్ జిల్లాకు చెందిన నిరుద్యోగులే ఎక్కువగా ఉన్నారు. తర్వాత స్థానంలో కరీంనగర్, వరంగల్ జిల్లాల వారు ఉన్నారు. కరీంనగర్ జిల్లా నుంచి 68,979 మంది, వరంగల్ నుంచి 67,514 మంది ఓటీఆర్ చేసుకున్నారు. ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 48,295 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం గమనార్హం. ఏ రాష్ట్రం పేరూ పేర్కొనకుండా మరో 1,892 మంది ఓటీఆర్ చేసుకున్నారు.
 
 ‘వన్‌టైమ్’కు దరఖాస్తుల తీరు..
 జిల్లా    పురుషులు    మహిళలు    మొత్తం
 మహబూబ్‌నగర్    31,937    12,692    44,629
 రంగారెడ్డి    37,428    21,179    58,607
 హైదరాబాద్    44,298    30,608    74,906
 మెదక్    28,456    12,673    41,129
 నిజమాబాద్    23,630    12,129    35,759
 ఆదిలాబాద్    24,979    10,735    35,714
 కరీంనగర్    45,350    23,629    68,979
 వరంగల్    45,294    22,220    67,514
 ఖమ్మం    32,528    15,527    48,055
 నల్లగొండ    40,796    17,564    58,360
 ఇతర రాష్ట్రాలవారు    37,927    10,368    48,295
 రాష్ట్రాన్ని పేర్కొననివారు    1,324    568    1,892
 మొత్తం    3,93,947    1,89,892    5,83,839

మరిన్ని వార్తలు