ఉత్తమ విమానాశ్రయాల్లో శంషాబాద్

18 Feb, 2015 02:09 IST|Sakshi
ఉత్తమ విమానాశ్రయాల్లో శంషాబాద్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 5-15 మిలియన్ ప్రయాణికుల విభాగంలో ప్రపంచంలో మూడో ర్యాంకును దక్కించుకుంది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) నుంచి 2014 సంవత్సరానికిగాను ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డును పొందింది. 5-15 మిలియన్ ప్రయాణికుల విభాగంలో గత ఆరేళ్లుగా టాప్-3 ర్యాంకుల్లో శంషాబాద్ విమానాశ్రయం నిలవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 300 విమానాశ్రయాల్లో నాణ్యమైన సేవల విషయంలో 34 అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ఏసీఐ ర్యాంకులను ప్రకటిస్తోంది.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా