3 నెలల్లో 30 వేల హ్యుందాయ్ గ్రాండ్ విక్రయాలు

6 Dec, 2013 02:45 IST|Sakshi
3 నెలల్లో 30 వేల హ్యుందాయ్ గ్రాండ్ విక్రయాలు

 న్యూఢిల్లీ: హ్యుందాయ్ గ్రాండ్ కార్ల అమ్మకాలు జోరుగా ఉన్నాయని కంపెనీ గురువారం తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ కారును మార్కెట్లోకి తెచ్చామని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. విడుదల చేసిన మూడు నెలల్లోనే 33 వేల కార్లను విక్రయించామని తెలిపారు. కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా మెట్రో, టైర్ టూ నగరాల్లో యువ కొనుగోలుదారుల నుంచి అధిక ఎంక్వైరీలు వచ్చాయని వివరించారు. అధికంగా విక్రయమైన 5 కార్ బ్రాండ్లలో ఇదొకటిగా నిలిచిందని పేర్కొన్నారు. యూ2 సీఆర్‌డీఐ డీజిల్ ఇంజిన్‌తో లభిస్తున్న గ్రాండ్ కారు 24  కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.
 

మరిన్ని వార్తలు