పన్ను చెల్లింపుదారులకు ఐటీ హెచ్చరిక

22 Dec, 2016 14:41 IST|Sakshi
పన్ను చెల్లింపుదారులకు ఐటీ హెచ్చరిక
పన్ను చెల్లింపుదారులు తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ను ఎవరితో పంచుకోవద్దని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ఒకవేళ పాస్వర్డు, ఐడీ అనధికారిక వ్యక్తుల చేతులోకి వెళ్తే యూజర్ల కీలక సమాచారం దుర్వినియోగానికి పాల్పడే అవకాశముందని పేర్కొంది. టీడీఎస్ సెంట్రలైజడ్ ప్రాసెసింగ్ ఈ మేరకు హెచ్చరికలను పన్ను చెల్లింపుదారులకు జారీచేసింది. పన్ను చెల్లింపుదారులు యూజర్ ఐడీ, పాస్వర్డు ఎంతో కీలకమైన సమాచారం,  వీటితో టీడీఎస్ సంబంధిత రహస్య సమాచారం, కీలకమైన డేటా దిద్దుబాటుకు గురయ్యే అవకాశముంటుందని పేర్కొంది. ఒకవేళ పాస్వర్డ్ హ్యాక్ అయిన లేదా దొంగతనానికి గురైనా, సమాచారం భద్రత ఉల్లంఘనకు గురయ్యే అవకాశముంటుందని వెల్లడించింది. దీనివల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని తెలిపింది.
 
కనీసం ఎనిమిది క్యారెక్టర్లు ఉండేలా యూజర్లు పాస్వర్డ్లు క్రియేట్ చేసుకోవాలని, దానిలో నెంబర్లు, స్పెషల్ క్యారెక్టర్లు కూడా ఉండేలా చూసుకోవాలని సూచించింది. అయితే ఈ పాస్వర్డ్ను తమ డెస్క్పై ఉన్న నోట్ప్యాడ్స్ లేదా వైట్బోర్డులపై రాయవద్దని తెలిపింది. ఈ-మెయిల్స్, ఫోల్డర్స్, ఫైల్స్ వంటి వాటి పాస్వర్డ్లు కూడా కంప్యూటర్లపై ఉంచుకోవడం ఇబ్బందులు కలుగజేయవచ్చని హెచ్చరించింది. ఒకవేళ యూజర్లు ఈ-మెయిల్ లేదా కంప్యూటర్ అకౌంట్ హ్యాక్ అయితే, పాస్వర్డ్లను దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంటుందని, మీ ఈ-మెయిల్ అకౌంట్ ద్వారా క్రెడిట్/డెబిట్ కార్డుల కీలక సమాచారం కూడా ఇతర వ్యక్తుల చేతిలోకి పోతుందని తెలిపింది.  
మరిన్ని వార్తలు