‘బాహుబలి’ నిర్మాత సంచలన ఆరోపణలు

27 Apr, 2017 08:28 IST|Sakshi


హైదరాబాద్‌: ఎమిరేట్స్‌ విమానంలో సిబ్బంది జాతివివక్ష వ్యాఖ్యలు చేయటంతోపాటు అనాగరికంగా వ్యవహరించారని ‘బాహుబలి’  చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ(46) ఆరోపించారు. దుబాయ్‌లో బాహుబలి చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్‌కు వస్తుండగా.. ఎమిరేట్స్‌ సిబ్బంది తమ బృందంతో వ్యవహరించిన తీరును ఆయన ట్విటర్లో పేర్కొన్నారు.

‘హైదరాబాద్‌కు ఎమిరేట్స్‌ ఈకే526లో వస్తున్నాం. గేట్‌బీ4 వద్దనున్న విమాన సిబ్బంది మా బృందంతో అనాగరికంగా వ్యవహరించారు. దారుణంగా ప్రవర్తించారు. ఈ సిబ్బందిలో ఒకరికి జాతివివక్ష ఉందని అర్థమైంది. నేను ఎమిరేట్స్‌లో తరచూ ప్రయాణిస్తాను. కానీ ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు’ అని శోభు ట్వీట్‌ చేశారు.

ఆ విమానంలో ప్రయాణించిన బాహుబలి బృందంలో దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, నటులు ప్రభాస్, రానా, అనుష్క ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి సినిమా రేపు(శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మరిన్ని వార్తలు