ఎంపీ పదవికి రాజీనామా చేయనే చేయను!

29 Aug, 2016 16:36 IST|Sakshi
ఎంపీ పదవికి రాజీనామా చేయనే చేయను!

అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప మరోసారి ధిక్కార స్వరాన్ని వినిపించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె రాజ్యసభ సభ్యత్వం నుంచి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోమవారం సింగపూర్‌  పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు.

ఎంపీ శశికళ పుష్పపై, ఆమె కుటుంబసభ్యులపై ఇద్దరు పనిమనుష్యులు లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. అయితే, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను బాహాటంగా ధిక్కరించడంతోనే తనపై కేసులు నమోదయ్యాయని పేర్కొంటూ ఆమె మద్రాస్‌ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ తీసుకున్నారు. ఇప్పటికే రాజీనామా చేయాలని జయలలిత అల్టిమేటం ఇచ్చినప్పటికీ, తాను రాజ్యసభ పదవి నుంచి దిగిపోనని ఆమె స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ పదవికి రాజీనామా చేయబోనని తెలిపారు. లైంగిక వేధింపుల  కేసులో ముందస్తు బెయిల్‌ విషయమై సోమవారం ఆమె మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్‌ ఎదుట హాజరై తన వాదనలు వినిపించారు.
 

>
మరిన్ని వార్తలు