ఐస్ చక్రాలు...

24 Jan, 2016 03:45 IST|Sakshi
ఐస్ చక్రాలు...

లండన్‌లోని లెక్సస్ కారు కంపెనీలో పనిచేసే ఔత్సాహికులకు ఓ ఆలోచన వచ్చింది. మంచు బాగా కురుస్తున్నపుడు రోడ్లపై కార్లు పట్టుతప్పి పక్కకు జారిపోవడం లేదా మంచులో కూరుకుపోవడం చూస్తుంటాం. అలాంటపుడు అదే మంచుతో చక్రాలను తయారు చేసి చూస్తే... అని సరదాగా అనిపించింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఓ నలుగురు సుమారు 36 గంటల పాటు శ్రమించి నాలుగు మంచు చక్రాలను తయారు చేశారు. లెక్సస్ ఎన్‌ఎక్స్ హైబ్రిడ్ కారును డీప్ ఫ్రీజర్‌ను పోలిన వాతావరణం ఉండే రూములో ఉంచి మంచు చక్రాలను బిగించారు.

తర్వాత మెల్లిగా మైదానంలోకి తీసుకొచ్చి నడిపారు. ఎంతదూరం నడిపారు... ఈ చక్రాలు ఎంతవరకు కరిగిపోకుండా ఉన్నాయనే వివరాలేమీ వీరు బయటపెట్టలేదు. సరదాగా చేసిన ప్రయత్నమని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు