ఐసీఐసీఐ కూడా గుడ్‌ న్యూస్‌ చెప్పిందోచ్‌!

15 May, 2017 16:32 IST|Sakshi
ఐసీఐసీఐ కూడా గుడ్‌ న్యూస్‌ చెప్పిందోచ్‌!

న్యూఢిల్లీ:  ప్రయివేటుబ్యాంక్‌దిగ్గజం ఐసీఐసీఐ కూడా గృహకొనుగోలు దారులకు శుభవార్త అందించింది. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  వడ్డీ రేట్టు ను తగ్గించిన  అనంతరం తాజాగా  ఐసీఐసీఐ  హెం లోన్లపై తగ్గింపు వడ్డీరేటును ప్రకటించింది.  గృహ రుణాల రేట్లపై   0.3 శాతం తగ్గించాలని నిర్ణయించినట్టు బ్యాంకు సోమవారం ప్రకటించింది.   రూ. 30లక్షలలోపు రుణాలపై ఈ  తగ్గింపును  అమలు చేయనుంది.    ఎఫర్డబుల్‌  హౌ సింగ్‌ పథకానికి ఊతమిచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త ప్రభుత్వ పథకం కింద, రూ.30 లక్షల రూపాయల కింద ఉన్న రుణాలు సరసమైన గృహాల రుణాలపై  0.3శాతం వడ్డీరేటును అమలు చేయనుంది. ఈ తగ్గింపుతో,  పరిశ్రమలో అతి తక్కువ ధరల్లో గృహ రుణాలను  జీతాలు తీసుకునేవారికి  అందుబాటులో తెచ్చింది.  సాలరీడ్‌ మహిళా ఉద్యోగులు 8.35 శాతం రేటులోనూ,  ఇతరులు 8.40 శాతం గృహ రుణాలు పొందనున్నారని ఒక ప్రకటనలోతెలిపింది.

కాగా ఇప్పటికే ప్రభుత్వ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 0.25 శాతం మేరకు సరసమైన గృహ రుణ  రేనుఏ తగ్గించింది. దీని ప్రకారం 25 లక్షల రూపాయల లోపు రుణగ్రహీతలకు 8.40 శాతం,   రు .1 కోట్ల వరకు వడ్డీ రేటును 8.50 శాతం వడ్డీ రేటు అమల్లోకి రానుంది.  మహిళల రుణగ్రహీతలకు రు. 25 లక్షల వరకు రుణాలకు 8.35 శాతం ప్రత్యేక వడ్డీని అందిస్తోంది. అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒక కొత్త  పథకాన్ని లాంచ్‌ చేసింది.   'గ్రాహ సిద్ధి' పేరుతో లాంచ్‌ చేసిన ఈ  పథకంలో నిర్మాణం, గృహ లేదా ఫ్లాట్, మరమ్మత్తు లేదా పునర్నిర్మాణాల కోసం రుణాలను మంజూరు చేయనున్నట్టుప్రకటించిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు