ఆర్‌బీఐ కంటే ముందే శుభవార్త చెప్పిన ఐడీబీఐ

7 Feb, 2017 08:54 IST|Sakshi
ఆర్‌బీఐ కంటే ముందే శుభవార్త చెప్పిన ఐడీబీఐ

ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ  వడ్డీరేట్లను తగ్గించింది.  గృహ రుణాలపై 0.60శాతంకోత పెట్టి  8.55శాతం వద్ద నిలిపింది. ఇప్పటివరకు ఈ  ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.7శాతంగా ఉంది.  రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన రేట్ల కంటేముందుగానే  తన తగ్గింపు నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ తగ్గింపు రేట్లు ఫిబ్రవరి 1నుంచి అమలు చేయనున్నట్టు బ్యాంక్‌ ప్రకటించింది.  వర్గాల వారీగా రుణాలు వివిధ కాలపరిమితి రుణాలపై  0.30శాతం నుంచి 0.35శాతం  వడ్డీతోచౌకగా రుణాలను అందించనున్నట్టు ఐడీబీఐ ఒకప్రకటనలో తెలిపింది.  

వార్షిక ఎంసీఎల్‌ఆర్‌ ను 8.60శాతం ,  రెండు సంవత్సరాల రేటు 8.85శాతంగా, వద్ద పెగ్గెడ్ ఉండగా, ఒక నెల రేటు 8.40శాతం, ఓవర్‌ నైట్‌ రేటును  8.20శాతంగా ఉండనున్నట్టు ప్రకటించింది. గృహరుణాలపైనే తాము ఎక్కువగా దృష్టిపెట్టినట్టు బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మైథిలీ బాలసుబ్రమణ్యన్ తెలిపారు. త్వరలో కారు లోన్లపై కూడా  వడ్డీరేటునుత గ్గించే యోచనలో ఉన్నట్టు చెప్పారు.
 

మరిన్ని వార్తలు