ఐడీబీఐ జోరు

22 Sep, 2016 12:41 IST|Sakshi
ఐడీబీఐ జోరు

ముంబై: ప్రభుత్వరంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ వాటా విక్రయ ప్రకటనతో మార్కెట్లో దూసుకుపోతోంది.  2.34లాభంతో 74.35  వద్ద ట్రేడవుతోంది.  ఒక దశలో 5శాతానికి పైగా ఎగిసింది.   నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ)లో 1.5 శాతం వాటాను వాటా విక్రయించినట్లు వెల్లడించింది.   6.75 లక్షల షేర్లు  టీఐఎంఎఫ్‌ హోల్డింగ్స్‌కు విక్రయించినట్లు  బీఎస్‌ఈకి  ఫైలింగ్ లో తెలిపింది. దీంతో ఐడీబీఐ బ్యాంక్‌ షేరు పట్ల  భారీ ఆసక్తి  నెలకొంది.  
గతంలో ప్రభుత్వ రంగ కంపెనీ ఎల్ ఐసీకి దాదాపు 9లక్షల షేర్లను(2శాతం) విక్రయించిన సంస్థ తాజాగా టిఐఎంఎఫ్ హోల్డింగ్స్ కు  భారీ వాటాను  విక్రయించింది.  దీంతో గత  ఏడాది కాలంగా స్తబ్దుగా ఉన్న ఐడీబీఐ షేర్లు  గురువారం నాటి మార్కెట్లో పుంజుకున్నాయి. కాగా 
బ్యాడ్ లోన్ల కారణంగా గత ఏడాది 13 శాతం వృద్ధితో పోలిస్తే ఇవాల్టి జోరుతో కలిపి  ఈ ఏడాది 3శాతం మాత్రమే వృద్ధి చెందింది.


 

మరిన్ని వార్తలు