ఐగేట్ నికర లాభం 7.5 శాతం వృద్ధి

17 Jan, 2014 01:57 IST|Sakshi
ఐగేట్ నికర లాభం 7.5 శాతం వృద్ధి

 న్యూఢిల్లీ: అవుట్ సోర్సింగ్ సంస్థ ఐగేట్ గతేడాది డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌కు 3.31 కోట్ల డాలర్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఏడాది ఇదే క్వార్టర్‌కు ఆర్జించిన నికర లాభం(3 కోట్ల డాలర్లు)తో పోల్చితే 7.5 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. నికర ఆదాయం 27 కోట్ల డాలర్ల నుంచి 10 శాతం వృద్ధితో 30 కోట్ల డాలర్లకు చేరాయని పేర్కొంది.
 
ఉత్తర అమెరికా మార్కెట్లో భారీ డీల్స్ కారణంగా నికర ఆదాయం పెరిగిందని వివరించింది. ఈ సంస్థ జనవరి-డిసెంబర్ కాలాన్ని ఆర్ధిక సంవత్సరంగా పాటిస్తుంది. గతేడాది కంపెనీ పనితీరు పట్ల కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో అశోక్ వేమూరి సంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది భారీ డీల్స్‌ను సాధించామని సంతోషం వ్యక్తం చేశారు. 9 మంది కొత్త క్లయింట్లు లభించారని, వీటిల్లో ఐదు ఫార్చ్యూన్ 1000 కంపెనీలు ఐదున్నాయని వివరించారు. ఇక పూర్తి సంవత్సరానికి కంపెనీ నికర లాభం 10 కోట్ల డాలర్ల నుంచి 36 శాతం వృద్ధితో 13 కోట్ల డాలర్లకు, నికర ఆదాయం 107 కోట్ల డాలర్ల నుంచి 8 శాతం వృద్ధితో 115 కోట్లకు పెరిగాయి.
 

మరిన్ని వార్తలు