ఐఐటీల స్పెషల్ డ్రైవ్స్

9 Aug, 2016 13:59 IST|Sakshi
ఐఐటీల స్పెషల్ డ్రైవ్స్

న్యూఢిల్లీ : ఉద్యోగ ఆఫర్ పొందని విద్యార్థుల సంఖ్యను తగ్గించుకోవడానికి, ఉద్యోగవకాశాలను పెంపొందించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ టెక్నాలజీ(ఐఐటీలు) కొత్త మార్గాలను ఎంచుకుంటున్నాయి. ప్రీ ప్లేస్మెంట్గా వచ్చే ఇంటర్న్షిప్ ఆఫర్లను ఇంజనీరింగ్ విద్యార్థులు స్వీకరించేలా ప్రోత్సహిస్తున్నాయి. దీంతో ఫైనల్ ప్లేస్మెంట్ల ఒత్తిడిని ఐఐటీలు తగ్గించుకోవాలనుకుంటున్నాయని దీనికి సంబంధించిన ఓ అధికారి చెప్పారు.  ఖరగ్పూర్, చెన్నై, కాన్పూర్, గౌహతి, రూర్కే, వారణాసి, హైదరాబాద్ ఐఐటీలు ఈ విధంగా ఓవర్డ్రైవ్ నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఎంప్లాయర్స్ నుంచి వచ్చే ఇంటర్న్షిప్లకు ఓకే చెప్పేలా విద్యార్థులను ఐఐటీలు సన్నద్ధం చేస్తున్నాయి.

ఇంటర్న్షిప్, విద్యార్థులో విశ్వాసాన్ని మరింతగా నింపుతుందని ఐఐటీ రూర్కే ప్రొఫెసర్, ప్లేస్మెంట్స్ ఇన్ఛార్జ్ ఎన్పీ పాధే తెలిపారు. ఇంటర్న్షిప్ పొందిన 90 శాతం మంది ఐఐటీ విద్యార్థులు కంపెనీల్లోనే ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్నారని ఐఐటీ హైదరాబాద్ ప్లేస్మెంట్ ఇన్ఛార్జ్, ట్రైనింగ్ సెల్ ఫ్యాకల్టీ మెంబర్ బీ వెంకటేశం చెప్పారు. చాలా ఐఐటీలు ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్లపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నట్టు వెల్లడించారు. తమ విద్యార్థులకు ఆఫర్ చేసే ఇంటర్న్షిప్లపై ఇన్స్టిట్యూట్లు సీరియస్గా తీసుకోనున్నట్టు తెలుస్తోంది. జాబ్ ఆఫర్లపై సరైన నిర్ణయం తీసుకోవడానికి కూడా ఈ ఇంటర్న్షిప్ ఎక్కువగా దోహదం చేయనుందని, ఇటు కంపెనీలకు, అటు స్టూడెంట్లకు ఇది ఓ పునాది మార్గంగా ఉపయోగపడనుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రతేడాది 5-15 శాతం విద్యార్థులు జాబ్ ఆఫర్లను పొందలేకపోతున్నారని,  ఈ నేపథ్యంలో ఇంటర్న్షిప్ అనేది ఐఐటీలకు సహజమైన అడుగని ఐఐటీ ఖరగ్ పూర్ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ చైర్మన్ దేవాసిస్ దేవ్ చెప్పారు. దీంతో పైనల్ ప్లేస్ మెంట్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చన్నారు. 300 ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లను ఈ ఏడాది ఐఐటీ ఖరగ్పూర్ పొందిందని, గతేడాదితో పోలిస్తే ఇది డబుల్ అయిందని పేర్కొన్నారు.  కొన్ని వారాల్లోనే ఐఐటీల్లో ప్రీప్లేస్మెంట్ ఆఫర్లు ప్రారంభంకాబోతున్నాయి.

మరిన్ని వార్తలు