పురుష ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌

14 Mar, 2017 15:14 IST|Sakshi
పురుష ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌

స్వీడన్‌కు ఫర్నిచర్ కంపెనీ ఐకియా ఇండియా తన కంపెనీలో తల్లితండ్రులైన ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. బిడ్డకు జన్మనిచ్చిన తల్లితోపాటు తండ్రికూడా ఆరు నెలల సెలవు దినాలను వర్తింప చేయనుంది.  ఈ మేరకు కొత్త పేరెంటల్‌ లీవ్‌ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఇక మీదట పురుష ఉద్యోగులకు కూడా ఆరు నెలల పెయిడ్‌  పెటర్నటీ లీవును అమలు చేయనుంది. తన సహ ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ కొత్త  విధానాన్ని ప్రకటించడం సంతోషగా ఉందని ఐకియా హెచ్‌ఆర్ మేనేజర్ అన్నా కారిన్ మాన్సన్ చెప్పారు.

మహిళా ఉద్యోగులకు 26 వారాలకు వేతనంతోకూడిన  సెలవుదినాలతోపాటు , మరో 16 వారాల పాటు  పనిగంటల్లో 50శాతం కోత పెడుతున్నట్టు  స్వీడిష్ ఫర్నీచర్ దిగ్గజం ఐకియా. సంస్థలో  ఉద్యోగులందరికీ ఈ కొత్త విధానాన్ని ఈ నెల నుంచే అమలు చేయనున్నట్టు  ప్రకటించింది. దీంతోపాటు తల్లులైన మహిళా ఉద్యోగులకు అదనపు సౌకర్యాలను కల్పించనున్నామని చెప్పారు. ట్యూబెక్టమీ చేయించుకున్న మహిళలకు అదనంగా మరో రెండువారాల  సెలవు ఇస్తున్నట్టు చెప్పారు.  ఒకవేళ  గర్భధారణ, ప్రసవం కారణంగా అనుకోని అనారోగ్యం బారిన పడితే గరిష్టంగా ఒక నెలపాటు  సెలవు ఇస్తున్నట్టు  తెలిపింది. సరోగేట్‌, సింగిల్‌  పేరెంట్‌,  దత్తత తీసుకున్నా కూడా ఈ  నిబంధన వర్తిస్తున్నందని కారిన్ మాన్సన్  తెలిపారు.

50/50 లింగ సమతుల్యతను సాధించే దిశగా తాము కృషి చేస్తున్నట్టు తెలిపారు. కుటుంబ బాధ్యతల్లో, పిల్ల పెంపకంలో ఉన్న ఉద్యోగుల కరియర్‌  కోసం డే  కేర్ సెంటర్లు, దీర్ఘకాలిక శిక్షణ, డెవలప్‌మెంట్‌ ప్లాన్స్‌ లాంటి  కొన్ని ప్రత్యేక చర్యల్ని కూడా చేపడుతున్నట్టు  చెప్పారు. కాగా  జర‍్మనీకి చెందిన  బ్యాంకింగ్‌ దిగ్గజం డ్యుయిష్  బ్యాంక్‌ ఇండియా  కూడా తండ్రులు 6 నెలల సెలవును ఆఫర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

 

మరిన్ని వార్తలు