రేపటి నుంచి ఈక్విటాస్ ఐపీఓ!

3 Apr, 2016 23:48 IST|Sakshi
రేపటి నుంచి ఈక్విటాస్ ఐపీఓ!

లిస్టింగ్‌కు వస్తున్న తొలి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్!



ముంబై: ఫైనాన్షియల్ సేవల రంగంలోని ‘ఈక్విటాస్’ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 5న మొదలవుతోంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్‌ఎఫ్‌బీ) లెసైన్సు కోసం దరఖాస్తు చేసిన ఈ సంస్థ... దానికి సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తిచేసింది. త్వరలో ఆర్‌బీఐ నుంచి తుది లెసైన్స్ పొందనున్నట్లు తెలియజేసింది. అదే జరిగితే... దేశీ స్టాక్ మార్కెట్లో లిస్టయిన తొలి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇదే అవుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లోగా లెసైన్సు పొంది కార్యకలాపాలు ఆరంభిస్తామని కంపెనీ ఎండీ పి.ఎన్.వాసుదేవన్ చెప్పారు. కంపెనీకి ప్రస్తుతం 539 బ్రాంచులున్నాయి. దీని పరిధిలో ఈక్విటాస్ మైక్రోఫైనాన్స్, ఈక్విటాస్ ఫైనాన్స్, ఈక్విటాస్ హౌసింగ్ ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇపుడు ఈ మూడింటినీ విలీనం చేసి ఎస్‌ఎఫ్‌బీగా మారుస్తారు.

 
ఐపీఓ వివరాలివీ...

ఐపీఓ ద్వారా కంపెనీ రూ.2,200 కోట్లు సమీకరిస్తోంది. షేరు ధర రూ.109-110గా ఉంటుంది. ఐపీఓ అనంతరం కంపెనీలో ఎఫ్‌ఐఐల వాటా 35 శాతానికి దిగివస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఐపీఓ ఇదే కావటం గమనార్హం.

 

మరిన్ని వార్తలు