ఇలియానాతో అభిమాని అసభ్య ప్రవర్తన

21 Aug, 2017 10:17 IST|Sakshi
ఇలియానాతో అభిమాని అసభ్య ప్రవర్తన

ఒకప్పుడు వరుస తెలుగు సినిమాలతో అలరించిన ఇలియానా ఇప్పుడు బాలీవుడ్‌కు పరిమితమయింది. తెలుగులో అవకాశాలు లేకపోవడంతో ఇటువైపు చూడటం మానేసిన ఈ అమ్మడు వరుసగా హిందీలో అవకాశాలను అందుకుంటోంది. అయితే, ఇటీవల ఓ పురుష అభిమాని ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించాడట. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించిన ఇలియానా.. అతని వికృత స్వభావంపై తీవ్రంగా మండిపడింది.

'మనం నివసిస్తున్నది చాలా సంకుచితమైన, అల్పమైన ప్రపంచం. నేనొక పబ్లిక్‌ ఫిగర్‌ని. బహిరంగ ప్రదేశాల్లో నాకు పెద్దగా వ్యక్తిగత జీవితం ఉండదని తెలుసు. కానీ, అంతమాత్రాన నాతో అసభ్యంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు. ఈ విషయంలో అభిమాన వికారాలను నాపై చూపకండి. నేనూ ఒక మహిళనే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి' అంటూ ఇలియానా ఘాటుగా ట్వీట్‌ చేసింది.

ప్రస్తుతం ఇలియానా నటించిన 'బాద్‌షాహో' హిందీ సినిమా సెప్టెంబర్‌ 1న విడుదల కానుంది.  అజయ్‌ దేవగణ్‌, ఇమ్రాన్‌ హష్మీ, ఈషా గుప్తా ప్రధాన పాత్రల్లో మిలాన్‌ లుథ్రియా రూపొందించిన ఈ సినిమాపై ఇలియానా భారీ ఆశలే పెట్టుకుంది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు