అప్పుడు మ్యాగీ.. ఇప్పుడు యిప్పీ!

24 Aug, 2015 00:50 IST|Sakshi
అప్పుడు మ్యాగీ.. ఇప్పుడు యిప్పీ!

అలీగఢ్: మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం అంశం మరుగునపడ్తున్న నేపథ్యంలో.. తాజాగా మరో ప్రముఖ నూడుల్స్ బ్రాండ్ ‘యిప్పీ’ శాంపుల్స్‌లోనూ నిషేధిత సీసం(లెడ్) పరిమితికి మించి ఉందని తేలింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఉన్న వివిధ షాపుల నుంచి సేకరించిన యిప్పీ నూడుల్స్‌ను పరీక్షించిన యూపీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ(ఎఫ్‌డీఏ) ఈ మేరకు నిర్ధారించింది. ‘యిప్పీ’ ప్రముఖ దేశీయ సంస్థ ఐటీసీకి చెందిన నూడుల్స్ బ్రాండ్. సీసం పరిమితి 1 పీపీఎం లోపు ఉండాల్సి ఉండగా, యిప్సీలో అది 1.057పీపీఎంగా ఉందని తమ పరీక్షల్లో తేలిందని అలీఘడ్ డివిజన్ ఎఫ్‌డీఏ డివిజన్ హెడ్ చందన్ పాండే ఆదివారం తెలిపారు.

దీనిపై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించి నిషేధిత పదార్ధాలు ఉన్న విషయం మొదట యూపీలోనే వెల్లడి కావడం విశేషం. అయితే, మ్యాగీ నూడుల్స్‌పై నిషేధాన్ని ఇటీవల బాంబే హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. మ్యాగీ నూడుల్స్‌ను మరోసారి పరీక్షించాలని ఆ కోర్టు ఆదేశించింది.

మరిన్ని వార్తలు