బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై ఫత్వా జారీ

12 Dec, 2016 16:37 IST|Sakshi
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై ఫత్వా జారీ
  • మమతకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు..

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్  ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మమతను జుట్టు పట్టి  ఈడ్చి పారేసి ఉండాల్సిందని దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పశ్చిమ్ మెద్నిపూర్  జిల్లా జార్గ్రామ్ లో ఆదివారం జరిగిన పార్టీ యువజన విభాగం భేటీలో మాట్లాడుతూ ఘోష్ ఇలా మమతపై నోరు పారేసుకున్నారు.    

    'పెద్దనోట్ల రద్దుతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వేలకోట్ల  రూపాయల నష్ట పోయారు. , అందుకే ఆమెకు మతి భ్రమించింది. ఢిల్లీలో ఆమె డ్రామా (ఆందోళన) చేస్తున్నపుడు జుట్టు పట్టి  లాగి విసిరి పారేసి ఉండవచ్చు.. అక్కుడన్న పోలీసులు మన వాళ్లే.. కానీ తాము అలా చేయలేదు' అంటూ దిలీప్ ఘోష్‌ చెప్పుకొచ్చారు. నోట్ల రద్దుతో పిచ్చి పట్టిన  మమత ఢిల్లీ, పట్నా చుట్టూ  చక్కర్లు  కొడుతోందని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై టీఎంసీ తీవ్రంగా  తప్పుబట్టగా.. తాజాగా దిలీప్‌ఘోష్‌ వ్యాఖ్యలను కోల్‌కతాకు చెందిన టిప్పు సుల్తాన్‌ మసీదుకు చెందిన ఇమామ్‌ కూడా ఖండించారు. మమతా బెనర్జీపై దిలీప్‌ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇమామ్‌ సోమవారం ఫత్వా జారీచేశారు.
     

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు