8% వృద్ధే లక్ష్యం: రాష్ట్రపతి ప్రణబ్

21 Dec, 2013 07:02 IST|Sakshi
8% వృద్ధే లక్ష్యం: రాష్ట్రపతి ప్రణబ్

చెన్నై, సాక్షి ప్రతినిధి : దేశంలో కొనసాగుతున్న ఆర్థిక పతనానికి అడ్డుకట్ట వేసేలా ఇంజనీరింగ్ విద్యాబోధన సాగాలని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉద్బోధించా రు. చెన్నైలో శుక్రవారం జరిగిన ఇంజనీరింగ్ కళాశాలల సమా ఖ్య సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, రెండేళ్లలో దేశ ఆర్థికాభివృద్ధి క్షీణించిందని తెలిపారు. 2012-13లో వృద్ధి రేటు 5 శాతవునీ, గత పదేళ్లలో ఇదే కనిష్ట వృద్ధి రేటనీ చెప్పారు. దీన్ని 8 శాతానికి మించిన స్థారుుకి పెంచడమే వున వుుందున్న తక్షణ సవాలని అన్నారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా దేశం ఆర్థిక పరిపుష్టి పొందుతుందని, దీనిని సాధించాలంటే మెరుగైన ఇంజనీరింగ్ విద్య అవసరమని పేర్కొన్నారు.


 మానవ అవసరాలకు, దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యను మెరుగుపర్చుకోవాలని సూచించారు. జపాన్, సింగపూర్‌లు ఆధునిక టెక్నాలజీ సాయుంతోనే అభివృద్ధి సాధించాయుని గుర్తుచేశారు. మెరుగైన విధానంతో నాణ్యమైన బోధనతో చురుకైన ఇంజనీర్లను దేశానికి అందించాల్సిన బాధ్యతను యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలలు గుర్తెరగాలని పేర్కొన్నారు. దేశం గత 20 ఏళ్లలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నదని, భవిష్యత్తులో ఎదురయ్యే మరెన్నో సవాళ్లను అధిగమించేలా విద్యావంతులను తీర్చిదిద్దాలని చెప్పారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, కేంద్ర మంత్రి జీకే వాసన్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు