లాడెన్‌ నుంచి షరీఫ్‌కు నిధులు!

10 May, 2017 09:03 IST|Sakshi
లాడెన్‌ నుంచి షరీఫ్‌కు నిధులు!

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌లో జిహాద్‌ ప్రచారం కోసం ఆల్‌ఖైదా నాటి చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ నుంచి నిధులు సేకరించారన్న ఆరోపణలకు సంబంధించి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై కోర్టులో దావా దాఖలు చేస్తామని పాకిస్తాన్‌లో ప్రతిపక్షం పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఈ–ఇన్సాఫ్‌(పీటీఐ) తెలిపింది. షరీఫ్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తామని పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్‌ చౌధరి సోమవారం వెల్లడించినట్లు ‘ది ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌( పేర్కొంది. తమ వాదనకు బలం చేకూర్చేలా పీటీఐ వద్ద తగిన ఆధారాలు లేవు.

ఐఎస్‌ఐ మాజీ గూఢచారి ఖలీద్‌ ఖవాజా భార్య షమామా ఖలీద్‌ పుస్తకం, ఆమె పలు సందర్భాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలపై ఆ పార్టీ ఆధారపడనున్నట్లు తెలిసింది. ఖవాజా 2010లో పాకిస్తాన్‌ తాలిబన్ల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. కశ్మీర్, అఫ్గానిస్తాన్‌లలో జిహాద్‌ వ్యాప్తికి షరీఫ్, లాడెన్‌ నుంచి రూ. 150 కోట్లు తీసుకున్నారని షమామా తన పుస్తకంలో వెల్లడించారు. అందులో నుంచి రూ. 27 కోట్లను, 1989లో అప్పటి ప్రధాని బెనజీర్‌ భుట్టో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వినియోగించారని తెలిపారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు