ఐఏఎస్ అశోక్ ఖేమ్కా వాట్సాప్‌లో ఏం చేశారంటే...

8 Apr, 2017 13:31 IST|Sakshi
ఐఏఎస్ అశోక్ ఖేమ్కా వాట్సాప్‌లో ఏం చేశారంటే...

చత్తీస్ఘడ్‌: కమ్యూనికేషన్‌ రంగంలో వస్తున్నసాంకేతిక విప్లవం నేపథ్యంలో హర్యానా  కోర్టు  ఓ ఆసక్తికర చర్య తీసుకుంది.  దేశంలో  మొట్టమొదటి సారి సోషల్‌ నెట్‌వర్కింగ్‌  సైట్‌​ వాట్సాప్‌ద్వారా  సమన్లు జారీ అయ్యాయి.  సంచలన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా ఈ  సంచలనానికి తెరతీసారు.  ఖేమ్కా నేతృత్వంలోని ఫైనాన్సియల్‌ కమిషనర్ (ఎఫ్‌సీ) కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ వాట్సాప్‌  ప్రింట్‌ అవుట్‌నే  సమన్ల డెలివరీ ప్రూఫ్‌గా పరిగణించాలని ఆదేశించారు.


కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో సివిల్‌, రెవెన్యూ తగాదాలను పరిష్కరించే ఎఫ్‌సీ కోర్టు దృష్టికి  హిసార్‌ లోని  ఔరంగ్‌ షాపూర్‌ గ్రామానికా చెందిన అన్నదమ్ముల ఆస్తి పంపకాల తగాదా ఒకటి వచ్చింది. సత్బీర్‌ సింగ్‌కు, సోదరులు రామ్‌ దయాల్‌, క్రిష్టన్‌ కుమార్‌లతో ఈ వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంలో సమాధానం చెప్పాల్సిందిగా  రామ్‌,  క్రిష్ణన్‌ కుమార్‌ లకు నోటీసులు పంపింది. అయితే రామదయాల్‌  నోటీసులను స్వీకరించారు కానీ, ఖాట్మాండులో ఉన్న  క్రిష్ణన్‌ కుమార్‌కు నోటీసులు అందించండం సాధ్యం కాలేదు.   దీనికితోడు  స్థానిక రెవెన్యూ అధికారులు  ఫోన్‌ ద్వారా  ఆయనను సంప్రదించినపుడు  చిరునామా, తదితర  వివరాలు ఇవ్వడానికి నిరాకరించాడు.  దీంతో ఖేమ్కా​ ఈ నిర్ణయంతీ సుకున్నారు. 
ప్రస్తుతం ఫోన్‌ నెంబర్‌, ఈ మెయిల్‌  ఐడీ తదితర  చిరునామాగా  పరిగణిస్తున్న నేపథ్యంలో   వాట్సాప్‌ ద్వారా కోర్టు ముద్రతో కూడిన నోటీసు  కాపీని కోర్టుని  జత  చేసి వాట్సాప్‌ లో  పంపించింది.  ఈ వాట్సాప్‌  మెసేజ్‌ డెలివరీ  ప్రింట్‌ అవుట్‌ నే  సమన్లు జారీ అయినందుకు సా‍క్ష్యంగా పరిగణించనుంది. 

కాగా  హర్యానాకు చెందిన  అశోక్‌ ఖెమ్కా నిజాయితీ ఐఏఎస్‌ అధికారిగా పేరు గడించారు.  ముఖ్యంగా భూ వ్యవహారాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ భూ బకాసురులకు సింహస్వప్నంగా నిలిచారు.  అంతేకాదు  46సార్లు  బదిలీ అయిన ఏకైక ఐఏఎస్‌ అధికారికూడా ఈయనే.
 

>
మరిన్ని వార్తలు