మోదీ సడెన్గా దారి ఎందుకు మళ్లించారు?

10 Dec, 2016 17:07 IST|Sakshi
మోదీ సడెన్గా దారి ఎందుకు మళ్లించారు?
గాంధీనగర్ : ప్రధాని నరేంద్రమోదీ నేడు గుజరాత్ రాజధాని గాంధీనగర్లో బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తల భేటీకి వెళ్లిన సంగతి తెలిసిందే. పార్టీ నేతల భేటీకి వెళ్లిన ఆయన, అకస్మాతుగా పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే తన దారిని మరలించారు. తన తల్లి హీరాబెన్ను చూడటానికి, ఆమె ఆశీర్వాదాలు స్వీకరించడానికి మీటింగ్ వెళ్లే దారిని మరలించి, తన తమ్ముడు పంకజ్ మోదీ ఇంటికి వెళ్లారు. అక్కడే 20 నిమిషాల పాటు మోదీ గడిపినట్టు తెలిసింది.
 
2 గంటలకు గాంధీనగర్లో దిగిన ప్రధాని మోదీ, అనంతరం వెంటనే తన పర్యటన మార్గాన్ని మార్చుకుని పార్టీ ప్రధాన కార్యాలయ ప్రాంతానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైసాన్ గ్రామానికి వెళ్లినట్టు పార్టీ నేత ఒకరు చెప్పారు. తల్లి దగ్గరకు వెళ్లిన మోదీ, అక్కడే 20 నిమిషాల పాటు తన సమయాన్ని గడిపారని, అనంతరం తల్లి ఆశీర్వాదం తీసుకుని పార్టీ కార్యకర్తల సమావేశానికి వచ్చినట్టు పేర్కొన్నారు. తన 66వ జన్మదిన సందర్భంగా గతసారి సెప్టెంబర్ 17న తన తల్లి దగ్గరికి మోదీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కొడుకు నిర్ణయాన్ని సమర్థిస్తూ హీరాబెన్ బ్యాంకు వద్దకు వెళ్లి మరి తన పాత నోట్లను మార్చుకుని వచ్చారు.  
 
మరిన్ని వార్తలు