ప్రపంచ ఆరాధ్యుల్లో గాంధీ, మోదీ

29 Oct, 2015 03:09 IST|Sakshi

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరాధ్యులైన వారి జాబితాలో భారత  ప్రధాని నరేంద్ర మోదీ పదో స్థానం దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికా దివంగత నేత నెల్సన్ మండేలా అగ్రస్థానంలో, భారత జాతిపిత మహాత్మాగాంధీ నాలుగో స్థానంలో నిలిచారు. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) 125 దేశాల్లోని 285 నగరాలకు చెందిన వెయ్యిమందికిపైగా యువత అభిప్రాయాలతో గ్లోబల్ షేపర్స్ వార్షిక సర్వే-2015 పేరుతో ఈ జాబితా రూపొందించింది. సర్వేలో పాల్గొన్నవారు డ బ్ల్యూఈఎఫ్ గ్లోబల్ షేపర్స్ కమ్యూనిటీ సభ్యులు.

జాబితాలో రెండో స్థానంలో పోప్ ఫ్రాన్సిస్, మూడో స్థానంలో టెల్సా మోటార్స్ సీఈఓ ఎలన్ మస్క్ ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్(5), అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తదితరులున్నారు.  సర్వేలో పాల్గొన్న మొత్తం 1,084 మందిలో మోదీకి 3 శాతం మంది మండేలాకు 20.1 శాతం, గాంధీకి 12.4 శాతం మంది ఓటేశారు.

మరిన్ని వార్తలు