కేంద్ర మాజీ మంత్రి ఇంట్లో ఐటీ సోదాలు

13 Jul, 2016 20:56 IST|Sakshi
కేంద్ర మాజీ మంత్రి ఇంట్లో ఐటీ సోదాలు

సాక్షి, చెన్నై: డీఎంకేకు చెందిన కేంద్ర మాజీమంత్రి జగద్రక్షకన్ ఆస్తులపై బుధవారం ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోని 40 చోట్ల ఈ దాడులు జరిగాయి. డీఎంకేకు చెందిన జగద్రక్షకన్ యూపీఏ-2లో కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు.

ఆయన ఆదాయ పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తించిన ఆ శాఖ వర్గాలు బుధవారం ఏకకాలంలో సోదాలు చేశాయి. అడయార్‌లోని ఆయన నివాసం, చెన్నై నగర శివారుల్లోని బాలాజీ మెడికల్ కళాశాల, ఠాకూర్ ఇంజినీరింగ్ కళాశాల, భారత్ వర్సిటీ, పుదుచ్చేరిలోని లక్ష్మీనారాయణ ఇంజినీరింగ్ కళాశాల, హోటళ్లతో పాటు 40 చోట్ల ఈ సోదాలు కొనసాగాయి. కీలక రికార్డులను ఐటీ వర్గాలు తీసుకెళ్లాయి.

మరిన్ని వార్తలు