కొండంత పెరిగిపోయిన ప్లాస్టిక్‌...

21 Jul, 2017 04:01 IST|Sakshi
కొండంత పెరిగిపోయిన ప్లాస్టిక్‌...

ప్లాస్టిక్‌.. మనిషికి ప్రియమైన శత్రువు అని దీనికి పేరు. పర్యావరణ కష్టాలున్నాయని తెలిసినా వాడకుండా ఉండలేకపోవడం దీనికి కారణం. 1950లలో తొలిసారి పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి మొదలైనప్పటి నుంచి ప్లాస్టిక్‌ వాడకం ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా పెరుగుతూనే ఉంది. 1950లలో కేవలం 20 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ మాత్రమే ఉండగా.. 2017 వచ్చేసరికి ఇది 40 కోట్ల టన్నులకు చేరింది. 2017 వరకూ మనిషి తయారు చేసిన మొత్తం ప్లాస్టిక్‌ బరువు 830 కోట్ల టన్నులు. ఇది వంద కోట్ల ఏనుగుల (ఒక్కొక్కటీ 7.6 టన్నుల బరువు అనుకుంటే) ఉమ్మడి బరువుతో సమానం. ఈఫిల్‌ టవర్‌లో వాడిన ఇనుము బరువుకు 8,22,000 రెట్లు ఎక్కువ. జార్జియా యూనివర్సిటీ జరిపిన ఒక అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ ఉత్పత్తి, వాడకం, రీసైక్లింగ్‌లపై సమగ్ర అంచనాను ఇచ్చింది. ఆ వివరాలు..

వాడకం ఇలాగే కొనసాగితే..
2050 నాటికి ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్‌ ... 3400 కోట్ల టన్నులు

2017 వరకూ..
మొత్తం ఉత్పత్తి    830 కోట్ల టన్నులు
చెత్తగా మిగిలింది    630 కోట్ల టన్నులు
రీసైకిల్‌ చేసింది    9 శాతం మాత్రమే
తగులబెట్టింది    12 శాతం
చెత్తకుప్పల్లోకి చేరి కాలుష్యం కలిగిస్తున్నది 79 శాతం!

2010 నాటి లెక్కల ప్రకారం.. సముద్రాల్లోకి చేరి జలచరాల ప్రాణాలు తీసేస్తున్న ప్లాస్టిక్‌ చెత్త ఎంతో తెలుసా...? 80 లక్షల టన్నులు!

మరిన్ని వార్తలు