లష్కరే, ఐఎస్‌ఐఎస్‌లపై సమష్టి పోరు

26 Aug, 2015 01:36 IST|Sakshi
లష్కరే, ఐఎస్‌ఐఎస్‌లపై సమష్టి పోరు

సుష్మా స్వరాజ్ పిలుపు
కైరో: తమ పొరుగున ఉన్న పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, తాలిబాన్‌లపైనా, గల్ఫ్ ప్రాంతంలో ముప్పుగా పరిణమించిన ఐఎస్‌ఐఎస్ లాంటి ఉగ్రవాద సంస్థలపై ఉమ్మడి పోరాటం చేద్దామని భారత్ పిలుపునిచ్చింది. నానాటికీ పెరిగిపోతున్న ఉగ్రవాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈజిప్టులో పర్యటిస్తున్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మంగళవారమిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఈజిప్టు వ్యూహాత్మక నిపుణులు, విధాన రూపకర్తలనుద్దేశించి మాట్లాడారు.

అపనమ్మకం, హింసల నుంచి శాంతి, అభివృద్ధి దిశగా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే.. చర్చల ద్వారా విస్తృతమైన దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. గల్ఫ్ ప్రాంతానికి ఐఎస్‌ఐఎస్ నుంచి ఎలాంటి ముప్పు పొంచి ఉందో.. భారత్‌కు కూడా పొరుగుదేశం నుంచి లష్కరే తోయిబా, తాలిబాన్‌ల నుంచి ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.

మరిన్ని వార్తలు