ఏవియేషన్‌లో పెట్టుబడులకు భారత్ ఆహ్వానం

31 Oct, 2013 18:22 IST|Sakshi

వాషింగ్టన్: భారత విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అమెరికన్ ఇన్వెస్టర్లను పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ ఆహ్వానించారు. పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కల్పించడంలో భాగంగా ఈ రంగంలో ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టినట్లు ఆయన వివరించారు. భారత్-అమెరికా 4వ ఏవియేషన్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా అజిత్ సింగ్ ఈ అంశాలు తెలిపారు.భారత ఎయిర్‌లైన్స్‌లో విదేశీ ఎయిర్‌లైన్స్ ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని (ఎఫ్‌డీఐ) 49 శాతానికి పెంచినట్లు చెప్పారు.

 

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకుకూడా విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో భారత ఏవియేషన్ రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని అజిత్ సింగ్ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు