చైనాను బీట్‌ చేసి మరీ నెం.1గా భారత్‌

8 May, 2017 18:07 IST|Sakshi
చైనాను బీట్‌ చేసి మరీ నెం.1గా భారత్‌

టూ వీలర్‌ మార్కెట్‌లో  భారత్‌   చైనాను బీట్‌ చేసింది.  ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌ వ్యవస్థగా నిలిచింది.  2016-17 ఆర్థిక సంవత్సరానికి చైనా విక్రయించిన 16.8 మిలియన్ యూనిట్లతో పోలిస్తే, 2016 నాటికి 17.7 మిలియన్ యూనిట్లను విక్రయించింది. ఈ విషయంలో చైనాను అధిగమించిందని  నివేదికలు వెల్లడించాయి. డీమానిటైజేషన్‌, బీఎస్‌ -3 వాహనాల నిషేధం,  బీఎస్‌ -4 నిబంధనల ప్రభావం ఉన్నప్పటికీ  భారత్‌ మార్కెట్‌ నెంబర్‌ 1గా  స్థానాన్ని నిలిచిందని సియామ్‌ వెల్లడించింది.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్ (ఎస్ఐఎఎమ్) అందించిన  నివేదిక ప్రకారం   ఇప్పటివరకూ ద్విచక్ర వాహన మార్కెట్‌ లో నెం. 1స్థానంలో ఉన్న చైనాను వెనక్కినెట్టిన  ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద  టూ వీలర్‌  మార్కెట్‌గా   అవతరించింది. గత నాలుగేళ్లుగా ఈ సెగ్మెంట్‌లో భారీ డిమాండ్‌ నెలకొందని తెలిపింది.  2011-12 లో 13 మిలియన్ల వాహనాలను  అమ్ముడు బోతే 2016-15లొ 16మిలియన్లకు, 2016-17 నాటికి 17 మిలియన్లకు డిమాండ్‌ పెరిగిందని రిపోర్ట్‌ చేసింది. మార్చి 30, 31, 2017 లో   ద్విచక్ర పరిశ్రమ  రూ. 600 కోట్ల రూపాయలని అంచనా వేశామని  ఇక్రా సీనియర్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సుబ్రతా రే  తన నివేదికలో తెలిపారు.

చైనా మార్కెట్‌లో  గత కొన్నాళ్లుగా వివిధకారణాల రీత్యా టూ వీలర్స్‌ డిమాండ్‌  క్షీణిస్తూ వస్తోంది.  ముఖ్యంగా దేశంలో కార్ల డిమాండ్ పెరగడం, ద్విచక్ర వాహనాలపై అధిక దిగుమతుల ఖర్చు పెరగడం ద్విచక్ర వాహన తయారీదారులకి కష్టంగా మారింది.  దీంతో చైనా ఈ సెగ్మెంట్‌లో  రెండవ స్థానానికి పడిపోయింది.  

కాగా ఏప్రిల్   అమ్మకాల్లో  హీరో ను  వెనక్కి నెట్టిన  బజాజ్‌  ఆటో   రెండవ అతిపెద్ద బైక్స్-మేకర్ గా  నిలిచింది. అంతేకాదు దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థగా హీరోనిఅధిగమించే  దిశగా దూసుకుపోతోంది. గత ఏడాది  1,50,711    యూనిట్లతో పోలిస్తే,  ఈ నెలలోనే 22 శాతం వృద్ధితో  1,83,266  యూనిట్లను విక్రయించినట్లు బజాజ్‌ ప్రతినిధి గులెరియా తెలిపారు. మొత్తం వాల్యూమ్స్‌ లో 34 శాతం వృద్ధితో మార్కెట్‌ లో రెండవ స్థానంలో నిలిచామన్నారు.   ఏప్రిల్ నెలలో బజాజ్ ఆటో అమ్మకాలు 19 శాతం పెరిగి 1,61,930 యూనిట్లు విక్రయించాయి.  జపాన్ ద్విచక్ర వాహన కంపెనీ  21,336 యూనిట్లు విక్రయించగా, మార్కెట్ లీడర్ హీరో మోటో కార్ప్తో 12,377 యూనిట్లు మాత్రమే.  అలాగే మార్చి 31 తో ముగిసిన నాల్గవ త్రైమాసికానికి రూ. 1,888 కోట్ల ఆదాయంతో రాయల్ ఎన్ఫీల్డ్ అత్యధిక త్రైమాసిక ఆదాయాన్ని ప్రకటించింది. 
 

మరిన్ని వార్తలు