ఇంటర్నెట్ యూజర్లు@ 24 కోట్లు

30 Jan, 2014 01:09 IST|Sakshi
ఇంటర్నెట్ యూజర్లు@ 24 కోట్లు

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. మొబైల్ ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ చేసే వినియోగదారులు బాగా పెరుగుతుండటంతో ఈ ఏడాది జూన్ కల్లా భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 28 శాతం వృద్ధితో 24.3 కోట్లకు చేరుతుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) తెలిపింది.

ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం...,
     గతేడాది జూన్‌నాటికి భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 19 కోట్లుగా ఉంది.
     2012లో 15 కోట్లుగా ఉన్న ఇంటర్నెట్ ఉపయోగించేవారి సంఖ్య 2013లో 42 శాతం వృద్ధి చెంది 21.3 కోట్లకు పెరిగింది.

     2012లో 6.8 కోట్లుగా ఉన్న మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2013లో 92% వృద్ధితో 13 కోట్లకు చేరింది. ఇక ఈ ఏడాది జూన్‌కల్లా వీరి సంఖ్య 18.5 కోట్లకు పెరుగుతుందని అంచనా. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల వాటా 76%గా ఉంటుంది.

     ఇంటర్నెట్ వినియోగం వృద్ధి చెందుతున్న కారణంగా ఇ-కామర్స్, డిజిటల్ అడ్వర్టైజింగ్ కూ డా చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతున్నాయి.

     2012 ఏడాది చివరినాటికి రూ.47,349 కోట్లుగా ఉన్న డిజిటల్ కామర్స్ మార్కెట్ గతేడాది చివరి కల్లా రూ.62,967 కోట్లకు వృద్ధి చెందింది. ఇక డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్ ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,938 కోట్లకు చేరుతుంది.

>
మరిన్ని వార్తలు