‘ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెళ్లను’

16 Jan, 2017 20:34 IST|Sakshi
‘ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెళ్లను’

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి హాజరుకాబోనని భారతీయ సంతతికి చెందిన మహిళ ప్రమీల జయపాల్ ప్రకటించారు. ట్రంప్ వాడిన పదజాలం, చర్యలు అమెరికా ప్రజాస్వామ్యాన్ని, చరిత్రను తక్కువ చేసేలా ఉన్నాయని సియాటెల్ నుంచి ప్రతినిధుల సభకు ఎంపికైన భారతీయ-అమెరికన్‌గా రికార్డు సృష్టించిన ప్రమీల పేర్కొన్నారు. అన్ని ఆలోచించి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. దాదాపు 24 మంది చట్టసభల ప్రతినిధులు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరుకాబోమని ప్రకటించారు.

‘అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత ట్రంప్ వైఖరిలో మార్పు వస్తుందని ఆశించాను. అందరినీ కలుపుకుపోతానని చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే ముందు కూడా ఆయన తీరు మారలేదు. ట్రంప్ మాటలు, చర్యలు మన చరిత్ర, హీరోలను అప్రతిష్ఠపాల్జేసేలా ఉన్నాయి. మన ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించేలా ఉన్నాయ’ని ప్రమీల జయపాల్ అన్నారు. ఈనెల 20 అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మరిన్ని వార్తలు