యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా భారత సంతతి మహిళ

25 Sep, 2013 10:31 IST|Sakshi

అమెరికా (యూఎస్)లో భారత సంతతి మహిళను కీలక పదవి వరించింది. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా ఇందిరా తల్వానీని నియమించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా ఆమెను నామినేట్ చేశారు. భారత సంతతి వ్యక్తి మనీష్ షాను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఈ పదవికి ఎంపికైన తొలి దక్షిణాసియా మహిళ ఇందిర కావడం విశేషం.

ఇందిర ప్రస్తుతం బోస్టన్లోని సెగల్ రొటిమన్ ఎల్ఎల్పీలో విధులు నిర్వహిస్తోంది. అక్కడే రాష్ట్ర ఫెడరల్ ట్రయల్ కోర్టులో ప్రాక్టీస్ చేసింది. పదోన్నతిపై మసాచూసెట్స్లో న్యాయమూర్తిగా సేవలు అందించనున్నారు. కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తారనే నమ్మకముందని ఒబామా అన్నారు.

మరిన్ని వార్తలు