13వ అంతస్థు నుంచి పడి ఏడేళ్ల ఎన్నారై బాలుడి మృతి

27 May, 2014 14:47 IST|Sakshi

షార్జాలో విషాదకర సంఘన చోటుచేసుకుంది. అక్కడి తమ అపార్టుమెంటులోని 13వ అంతస్థు బాల్కనీ లోంచి కింద పడిపోయి ఏడేళ్ల భారత సంతతి బాలుడు మరణించాడు. దాంతో నిర్లక్ష్యం వహించినందుకు పోలీసులు ఆ బాలుడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఆడుకోవాల్సిన చిన్న పిల్లాడు బాల్కనీలోకి వెళ్లి, అంత పైకి ఎలా ఎక్కాడని, అంత జరుగుతున్న ఎందుకు గమనించలేకపోయారని పోలీసులు వాళ్లను ప్రశ్నించారు.

దుబాయ్ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతానికి పోలీసులకు ఓప్రత్యక్ష సాక్షి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. బాలుడి మృతదేహాన్ని అల్ కువాయిట్ ఆస్పత్రికి తరలించి అక్కడినుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపారు. షార్జా పోలీసులు ప్రత్యక్ష సాక్షులను కూడా ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులు ఇళ్లలో తమ పిల్లలను ఒంటరిగా వదిలేయొద్దని, కనీసం ఇంట్లో పనివాళ్లయినా వాళ్లను కనిపెట్టుకుని ఉండాలని షార్జా పోలీసు అధికారి కల్నల్ సుల్తాన్ అల్ ఖయాల్ తెలిపారు. ఇటీవలి కాలంలో యూఏఈలో పలువురు పిల్లలు ఇలా కిందపడి మరణించారు.

మరిన్ని వార్తలు