విమానంలో వై-ఫైకు అనుమతి!!

25 Aug, 2016 10:20 IST|Sakshi
విమానంలో వై-ఫైకు అనుమతి!!

న్యూఢిల్లీ : విమాన ప్రయాణంలో ఉన్నప్పుడు ఫేస్బుక్లో సమయాన్ని వెచ్చించడం, ట్వీట్ చేయడం మిస్ అవుతున్నారా.? అయితే ప్రయాణికులకు త్వరలోనే ఓ గుడ్న్యూస్ అందనుంది. విమానాలు భారత గగనతలంలో ఎగురుతున్నప్పుడు వై-ఫై వాడుకునే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పించాలని పౌరవిమానయాన శాఖ నిర్ణయించిందట. 10 రోజుల్లో దీనిపై ఓ శుభవార్తను అందించనున్నట్టు పౌర విమానయాన కార్యదర్శి ఆర్ఎన్ చౌబే తెలిపారు. భారత గగనతలంలో వై-ఫై ఆపరేట్కు అనుమతి ఇవ్వనున్నట్టు వెల్లడించారు.


ఇప్పటివరకు విమాన ప్రయాణంలో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వాడకాన్ని అనుమతించేవారు కాదు. ఎవరైనా ఫోన్ను వాడితే అది నేరంగా పరిగణించేవారు. ప్రస్తుతం పౌర విమానయానం తీసుకునే ఈ నిర్ణయంతో కాల్స్ చేసుకునే అవకాశం కూడా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. సివిల్ ఏవియేషన్ సెక్రటరీ వాగ్దానంతో, 'అచ్చే దిన్' ఫైనల్గా విమాన ప్రయాణికుల ముందుకు విచ్చేస్తుందట.

ఈ ప్రతిపాదన అమలుకు కేబినెట్ అనుమతి అవసరం లేదని, 10 రోజుల్లో ప్రయాణికుల ముందుకు ఈ అవకాశాన్ని తీసుకురానున్నట్ట చౌబే తెలిపారు. భారత గగనతలంలో ఎగిరే భారత, విదేశీ విమనాలన్నింటికీ ఈ సౌకర్యం అనుమతించనున్నట్టు వెల్లడించారు. ఎయిర్ ప్యాసెంజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏపీఏఐ) నిర్వహించిన అవార్డు ఫంక్షన్లో చౌబే ఈ విషయాన్ని తెలిపారు.

>
మరిన్ని వార్తలు