ఏప్రిల్ 16 నుంచి లోక్‌సభ ఎన్నికలు!

17 Jan, 2014 02:57 IST|Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తేదీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తు పూర్తయినట్లు తెలిసింది.  ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 16న ప్రారంభమయ్యే సార్వత్రిక ఎన్నికలు ఐదు విడతల్లో మే 13తో ముగుస్తాయి. మే 16న ఫలితాలు ప్రకటించాలని సంఘం నిర్ణయించిందని తెలిసింది. షెడ్యూల్‌ను మార్చి మొదటి వారంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత సమాచారం ప్రకారం షెడ్యూల్ ఇలా ఉంది: తొలివిడత- ఏప్రిల్ 16 (124 సీట్లు), రెండోవిడత- ఏప్రిల్ 22/23 (141 సీట్లు), మూడోవిడత- ఏప్రిల్ 30 (107 సీట్లు), నాలుగో విడత- మే 7 (85 సీట్లు), - ఐదో విడత, మే 13 (86 సీట్లు).

మరిన్ని వార్తలు