మీడియా పాత్ర బేష్: ఐఎండీ

13 Oct, 2013 12:47 IST|Sakshi

పై-లీన్ తుపాన్ వల్ల ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుతం ఏలాంటి ముప్పు లేదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం న్యూఢిల్లీలో స్పష్టం చేసింది. ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపింది. అంతేకాకుండా మీడియా కవరేజ్ వల్ల అటు ఒడిశా, ఇటు ఉత్తరాంధ్రలోని తీరప్రాంత ప్రజలు మరింత అప్రమత్తమైయ్యారని పేర్కొంది.

 

కచ్చితమైన హెచ్చరికల వల్ల నష్టాన్ని చాలా వరకు నివారించగలిగామని భారత వాతావరణ శాఖ అభిప్రాయపడింది. రానున్న 24 గంటల్లో 100 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. అంతేకాకుండా తుపాన్ ప్రభావంతో నేపాల్, బీహార్ సరిహద్దుల్లో భారీ వర్షపాతం నమోదు అవుతుందన్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా