స్విస్ బ్యాంకుల్లో తగ్గిపోయిన మన డబ్బు!

18 Jun, 2015 18:29 IST|Sakshi
స్విస్ బ్యాంకుల్లో తగ్గిపోయిన మన డబ్బు!

నల్లధనానికి స్వర్గధామాలుగా ఉండే స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సొమ్ము గత సంవత్సరం కంటే దాదాపు 10 శాతం తగ్గిపోయింది. ఈ మొత్తం దాదాపు రూ. 12,615 కోట్లట! భారతదేశంతో పాటు ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా స్విస్ బ్యాంకు ఖాతాల వివరాలను రహస్యంగా ఉంచడానికి వీల్లేదని, వాటిని ప్రభుత్వాలకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడం వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నారు. ఈ వివరాలను అక్కడి స్విస్ నేషనల్ బ్యాంకు వర్గాలు తెలిపాయి.

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు ఇంత తక్కువ మొత్తంలో ఉండటం ఇది రెండోసారి అని చెబుతున్నారు. 2013లో ఒకేసారి అంతకుముందున్న దానికంటే 40 శాతానికి పైగా డబ్బు పెరిగింది. కానీ ఈసారి మాత్రం ఏకంగా 12వేల కోట్ల రూపాయలు పడిపోయింది. 2012లో కూడా ఇలాగే ఒకసారి భారతీయుల డబ్బు బాగా తగ్గింది. అప్పట్లో అయితే దాదాపు 33 శాతం వరకు తగ్గిపోయిందని చెబుతున్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు