కూతుర్ని చూడనివ్వలేదని..

5 Nov, 2016 09:30 IST|Sakshi
కూతుర్ని చూడనివ్వలేదని..

సింగపూర్: మాజీ భార్య గొంతుకోసిన కరుణాకరణ్ అనే భారతీయ వ్యక్తికి 8 సంవత్సరాల జైలుతో పాటు తొమ్మిది బెత్తం దెబ్బలను సింగపూర్‌ కోర్టు శిక్షగా విధించింది. కరుణాకరణ్‌కు సింగపూర్‌కు చెందిన భూమిచెల్వి రామస్వామితో 2011లో వివాహమైంది. కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగానే సాగినా తరువాత వివాదాలు మొదలయ్యాయి. దీంతో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకునే నాటికి వీరికి ఏడాది వయసున్న పాప ఉంది.

తన పాపను చూడటానికి మాజీ భార్య అనుమతించడం లేదని కోపం పెంచుకున్న కరుణాకరణ్ 2013 అక్టోబర్‌లో ఆమె గొంతుకోసి హత్య చేయడానికి ప్రయత్నించాడు. అయితే.. అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ కేసులో శనివారం తుదితీర్పు వెల్లడించిన న్యాయమూర్తి చన్ సెంగ్ ఓన్ కరుణాకరణ్‌కు 8 ఏళ్ల జైలు, 9 బెత్తం దెబ్బల శిక్షను ఖరారు చేశారు. కూతురుని చూడాలని అంతగా కోరుకుంటే న్యాయస్థానం ద్వారా ప్రయత్నించాల్సింది కానీ.. దాడికి పాల్పడటం ఎంతమాత్రం సరికాదని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు