కుప్పకూలిన సమాచార వ్యవస్థను పునరుద్ధరించేలా..

16 Aug, 2016 18:06 IST|Sakshi

- 'విపత్తు నిర్వహణ'పై భారత సంతతి విద్యార్థి నూతన ఆవిష్కరణ

లండన్: భూకంపం, సునామి, టోర్నడో, హిమపాతాల వంటి ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలడం, బాధితుల కోసం చేపట్టే సహాయ కార్యక్రమాల్లో ఆటంకాలు తలెత్తడం తెలిసిందే. అయితే భారత సంతతి విద్యార్థి ఆవిష్కరించిన ఓ నూతన పరికరంతో విపత్తు తలెత్తిన ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించే వీలుంటుంది. తద్వారా విపత్తు నిర్వహణ సాధ్యమైనంత వేగంగా చేపట్టేవీలుంటుంది.

ఇంగ్లాండ్ లోని స్టాఫోర్డ్ షైర్ యూనివర్సిటీ విద్యార్థి లక్మాన్ పటేల్ 'ఎక్సిజెన్సీ' పేరుతో రూపొందించిన పరికరం.. అడ్ హాక్ నెట్ వర్క్ ద్వారా పనిచేస్తుంది. విపత్తు తలెత్తిన చోట ఈ పరికరాన్ని ఉంచితే.. దాని చుట్టుపక్కల 2.5 కిలోమీటర్ల పరిధిలోని ఫోన్లకు శాటిలైట్ డేటా బట్వాడా అవుతుంది. ఆయా ప్రదేశాల్లో సహాయ కార్యక్రమాలు నిర్వహించేవారికి 'ఎక్సిజెన్సీ' ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నాడు లక్మాన్. అయితే ఇప్పటికీ పరికరం తయారి ప్రాథమిక దశలోనే ఉందని, త్వరలోనే పూర్తిస్థాయి పరికరాన్ని రూపొందిస్తానని అంటున్నారు. (పై ఫొటోలోని యంత్రం లక్మాన్ ప్రయోగానికి సంబంధించిన ఊహాచిత్రం) భారత సంతతి విద్యార్థి తయారుచేసిన విపత్తు నిర్వహణ యంత్రానికి వర్సిటీ శాస్త్రవేత్తల నుంచి కితాబులు దక్కాయి.

>
మరిన్ని వార్తలు