లోయర్ బెర్త్ కావాలంటే... బాదుడే!

13 May, 2017 17:17 IST|Sakshi
లోయర్ బెర్త్ కావాలంటే... బాదుడే!

న్యూఢిల్లీ: రైలు ప్రయాణంలో సినియర్‌ సిటిజన్లు, అనారోగ్యంతో ఉన్నవారు, మహిళలు సాధారణంగా కింది బెర్త్‌  ఎంపికకు ఇష్టపడతారు. ఇలా  సౌకర్యవంతంగా ప్రయాణించలనుకున్న రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వేశాఖ  గట్టి షాకే ఇవ్వనుంది. లోయర్‌బెర్త్‌   బుకింగ్‌లపై  అదనపు చార్జీల వసూలుకు యోచిస్తోంది.  విమానాల్లో విండో సీట్ల కేటాయింపునకు అధిక చార్జీ వసూలు చేసినట్టుగానే రైళ్లలో కూడా  లోయర్‌బెర్త్‌ బుకింగ్‌లపై చార్జీల బాదుడుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.  వీటి బుకింగ్స్‌లో భారీ డిమాండ్‌ నెలకొన్న నేపథ్యంలో రైల్వే శాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

రైల్వే రిజర్వేషన్‌ సందర్భంగా  లోయర్‌ బెర్త్‌లకు భారీ డిమాండ్‌ నెలకొన్న నేపథ్యంలో ఎయిర్‌లైన్స్‌ బాటలోనే పయనిస్తూ ఈ నిర్ణయం తీసుకోనుంది.  కింది బెర్త్‌ బుకింగ్‌లపై రూ .50 పెంచాలని భారత రైల్వే శాఖ సిఫారసు చేసినట్టు సమాచారం.  కాగా  ప్రస్తుతం భారతీయ రైల్వేస్ వెబ్‌సైట్‌ లో టిక్కెట్లను బుకింగ్ సందర్భంగా  బెర్త్‌లను ఎంపిక చేసుకునే ఒక ఆప్షన్‌ను  ప్రయాణికులకు అందింస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు