టెలికం యూజర్లు @ 90.6 కోట్లు

26 Oct, 2013 00:56 IST|Sakshi

 న్యూఢిల్లీ: భారత టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది ఆగస్టు నాటికి 90.61 కోట్లకు చేరిందని టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) శుక్రవారం తెలిపింది.  ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం...,
 

  •      జూలై చివరినాటికి 90.44 కోట్లుగా ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ఆగస్టు చివరినాటికి 0.19 శాతం వృద్ధితో  90.61 కోట్లకు పెరిగింది. వైర్‌లెస్ వినియోగదారుల సంఖ్య 87.48 కోట్ల నుంచి 0.21 శాతం వృద్ధితో 87.67 కోట్లకు చేరింది. మొత్తం మీద వైర్‌లెస్ టెలి డెన్సిటీ 71.13 నుంచి 71.21కి వృద్ధి చెందింది.
  •      మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ) కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఆగస్టులో 23.7 లక్షలకు చేరింది. దీంతో ఇప్పటివరకూ ఎంఎన్‌పీకి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 10 కోట్లకు పెరిగింది.
  •      మొత్తం బ్రాడ్‌బాండ్ వినియోగదారుల సంఖ్య 1.524 కోట్ల నుంచి 1.528 కోట్లకు పెరిగింది.
  •      ఇక ఆగస్టులో ఎయిర్‌సెల్ సంస్థకు అధికంగా(8.76 లక్షల మంది) కొత్త వినియోగదారులు లభించారు. ఆ తర్వాతి స్థానాల్లో భారతీ ఎయిర్‌టెల్(8.33 లక్షలు), ఐడియా(7.52 లక్షలు), ఆర్‌కామ్(5.10 లక్షలు), వీడియోకాన్(1.58 లక్షలు), లూప్(65 వేలు)లు నిలిచాయి.
  •      యూజర్ల సంఖ్య పరంగా రెండో స్థానంలో ఉన్న వొడాఫోన్ ఆగస్టులో 85 వేల మందిని కోల్పోయింది.  బీఎస్‌ఎన్‌ఎల్(1.31 లక్షలు), ఎంటీఎన్‌ఎల్(2.92 లక్షలు), టాటా టెలి సర్వీసెస్(3.73 లక్షలు), సిస్టమ శ్యామ టెలి సర్వీసెస్(15,515 మంది)  కూడా వినియోగదారులను కోల్పోయాయి.
     

మరిన్ని వార్తలు