ఢిల్లీకి వెళ్లిపోతా.. భద్రత కల్పించండి!

14 May, 2017 07:35 IST|Sakshi
ఢిల్లీకి వెళ్లిపోతా.. భద్రత కల్పించండి!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ నుంచి ఢిల్లీ తిరిగి వెళ్లేందుకు తనకు భద్రత కల్పించాల్సిందిగా పెళ్లి కోసం పాక్‌కు వెళ్లి మోసపోయిన భారతీయ యువతి ఉజ్మా శుక్రవారం ఇస్లామాబాద్‌ హైకోర్టును కోరారు. ఢిల్లీచెందిన ఉజ్మా పాకిస్తాన్‌కు చెందిన తాహిర్‌ అలీని మలేసియాలో కలుసుకుని, పెళ్లి చేసుకునేందుకు పాక్‌కు ఈ నెల 1న పాక్‌కు వెళ్లడం తెలిసిందే.

అప్పటికే అలీకి పెళ్లయ్యి నలుగురు పిల్లలు కూడా ఉన్నారనీ, ఈ విషయం ముందుగా తనకు చెప్పకుండా పాక్‌కు వచ్చాక మోసగించి, బెదిరించి అలీ తనను బలవంతంగా పెళ్లి  చేసుకున్నాడని ఆమె ఆరోపిస్తున్నారు. తన పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాలను కూడా అలీ దొంగిలించాడని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఉజ్మా పాకిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఉంటున్నారు. భారత్‌కు తిరిగి వెళ్లేందుకు తనకు భద్రత కల్పించడంతోపాటు డూప్లికేట్‌ ప్రయాణ ప్రతాలను అందించాల్సిందిగా అధికారులను ఆదేశించాలని ఆమె ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

ఫొటోలు తీసినందుకు క్షమాపణ చెప్పిన భారత అధికారి
ఊజ్మ కేసు విచారణ సాగుతుండగా పాక్‌లోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న పియూష్‌ సింగ్‌ అనే సీనియర్‌ అధికారి కోర్టు లోపల ఫొటోలు తీశారు. ఇది కోర్టు నియమాలకు విరుద్ధం. ఈ విషయం న్యాయమూర్తి దృష్టికి వెళ్లడంతో పియూష్‌ సింగ్‌ లిఖిత పూర్వకంగా కోర్టుకు క్షమాపణలు చెప్పారు. 

మరిన్ని వార్తలు