ఈ ఫేస్బుక్ ప్రేమకథలో ఎన్ని ట్విస్టులో..

24 Sep, 2016 16:19 IST|Sakshi
ఈ ఫేస్బుక్ ప్రేమకథలో ఎన్ని ట్విస్టులో..

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన నైనా అనే యువతి.. బంగ్లాదేశ్‌కు చెందిన జన్నత్ అనే మహిళ మొదట స్నేహితురాళ్లు. ఫేస్బుక్ ద్వారా మొదలైన వీరి పరిచయడం ఫోన్ నంబర్లు మార్చుకుని ప్రేమ కబుర్లుచెప్పుకునేవరకూ వెళ్లింది. అలా మనసులు కలిశాక దూరంగా ఉండలేని పరిస్థితి. దీంతో 2013లో జన్నత్ సూట్‌కేస్ సర్దుకుని ఇండియా(ఇండోర్) వచ్చేసింది. నైనా చదువుతున్న కాలేజీలోనే చేరింది. జన్నత్ కూడా ఇంట్లో ఉండేలా నైనా తన తల్లిదండ్రులను ఒప్పించింది. కొన్నాళ్లు గడిచాక నైనాకు పెళ్లి సంబంధం కుదిరింది.

'పెళ్లైన తర్వాత కూడా జన్నత్ నాతోనే ఉండాలి'అనే షరతుమీద నైనా పెళ్లికి ఒప్పుకుంది. వీళ్ల విచిత్ర స్నేహ బంధాన్ని చూసి కంగారుపడ్డా.. 'ఆ మూడుముళ్లు' పడితే కూతురి మనసు మారిపోతుందని భావించారు నైనా తల్లిదండ్రులు. అందుకే జన్నత్ విషయం తెలియనీయకుండా మహేశ్ అనే కుర్రాడితో నైనా పెళ్లి జరిపించారు. హనీమూన్ కోసమని గోవా బయలుదేరగా జన్నత్‌ను కూడా వెంటతీసుకెళ్తాదమని అడగడంతో భర్త మహేశ్ సరేనన్నాడు. తీరా గోవా వెళ్లాక మహేశ్‌ను హోటర్ గదిలో ఉంచి, బయటి నుంచి తాళంవేసి నైనా, జన్నత్లు షికార్లకు వెళ్లేవారు. 'ఏమిటిది?'అని నిలదీసిన భర్తపై నైనా వేధింపుల కేసు పెట్టింది.

ఈ మేరకు ఇండోన్ మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. దర్యాప్తు చేసిన పోలీసులకు నైనా, జన్నత్ లు భార్యాభర్తలుగా భావించుకుంటున్నారన్న సంగతి తెలిసింది. జన్నత్ మొబైల్లో నైనా నంబర్ 'వైఫ్'గా ఫీడ్ చేసుకోగా, నైనా.. జన్నత్ నంబర్ ను 'హబ్బీ'అని ఫీడ్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మూడేళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న ఈ ప్రేమ కేసును పోలీసులు ఇటీవలే పరిష్కరించారు. జన్నత్, నైనాలు కలిసి జీవించేందుకు వారి తల్లిదండ్రులు అంగీకరించారని, అదే సమయంలో మహేశ్ పై పెట్టిన వేధింపుల కేసును ఉపసంహరించుకునేందుకు అంగీకరించారని మహిళా పోలీస్ స్టేషన్ అధికారి జ్యోతి వర్మ మీడియాకు తెలిపారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా