ఫలితాలతో డీలా పడిన ఇండోకౌంట్‌ షేర్

23 Aug, 2016 15:15 IST|Sakshi


ముంబై: టెక్స్‌టైల్స్‌ సంస్థ ఇండోకౌంట్‌   ఇండస్ట్రీస్ లిమిటెడ్ మంగళవారం ఆర్థిక ఫలితాలనుప్రకటించింది.  నికర లాభం15.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో  రూ. 60.3 కోట్ల నికర లాభాలను గడించింది. గత ఏడాది  నికర లాభాలు రూ.52 కోట్లుగా ఉన్నాయి. రూ.493  కోట్ల మొత్తం ఆదాయాన్ని సాధించింది. ఈ క్వార్టర్ లోరూ.539కోట్ల ఆదాయాన్ని సాధిస్తుందని  మార్కెట్ వర్గాలు  అంచనా వేసాయి. నికర లాభాల్లో వృద్ది ఉన్నప్పటికీ ఆదాయం  క్షీణించడంతో  షేర్ ధర దాదాపు 7 శాతం నష్టపోయింది.  భారీ అమ్మకాలతో  కౌంటర్‌ డీలా పడిన ఇండో  కౌంట్  ఉదయం సెషన్ లో 11 శాతానికిపైగా పతనమైంది.   ఒక దశలో  షేరు ధర  రూ. 798 వద్ద కనిష్టాన్ని తాకింది.

>
మరిన్ని వార్తలు