కోహ్లీ మీద ప్రేమతో ఖుష్బూ ఏం చేసిందంటే..

6 Nov, 2016 17:49 IST|Sakshi
కోహ్లీ మీద ప్రేమతో ఖుష్బూ ఏం చేసిందంటే..

ఇండోర్: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే మీకు ఇష్టమేనా? అతని ఆటను ఆస్వాదిస్తారా? సరే, కేవలం మ్యాచ్ చూడటమే కాకుండా ఆ క్రీడాకారుడిపై అభిమానాన్ని ఎలా చాటుకుంటారు? మహాఅయితే కోహ్లీ సెంచరీ కొట్టినప్పుడో, అతని పుట్టిన రోజునో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారేమో! కానీ కేవలం కోహ్లీ మీద ప్రేమతో బర్త్ డే డేట్ ని మార్చుకోగలరా?

ఇండోర్ (మధ్యప్రదేశ్) కు చెందిన ఖుష్బూ తన అసలు పుట్టిన రోజును ఎప్పుడో మర్చిపోయింది. కోహ్లీ పుట్టినరోజైన నవంబర్ 5నే ఆమె కూడా బర్త్ డే జరుపుకొంటుంది. ఆ ఆటగాడంటే ఆమెకు అంత అభిమానం! రెండు రోజుల కిందటే 16వ పుట్టినరోజు జరుపుకొన్న ఖుష్బూ.. ఇప్పటివరకు విరాట్ కోహ్లీకి సంబంధించిన 3000 ఫొటోలను సేకరిచింది. వాటిలో కోహ్లీ చిన్ననాటివేకాక సెంచరీలు కొట్టినవి, టాలూలుక సంబంధించినవి, అమ్మానాన్నలతో దిగినవి, గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసున్నవి.. వందలకొద్దీ ఫొటోలున్నాయి ఖుష్బూ దగ్గర.

'నా పదో ఏట అనుకుంటా.. ఒక రోజు ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూశా, కోహ్లీ ఇరగదీశాడు. ఎందుకో ఆ క్షణమే ఆయనకు అభిమానినైపోయా. అప్పటినుంచి కోహ్లీపై ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఆ ఇష్టంతోనే అతనికి సంబంధించిన ఫొటోలు సేకరిస్తా. ఇప్పటిదాకా 3వేల పైచిలుకు ఫొటోలున్నాయి. చివరికి నా అసలు పుట్టిన రోజుకు బదులు కోహ్లీ బర్త్ డే నాడే నేనూ కేక్ కట్ చేస్తున్నా. అమ్మానాన్నలు కూడా నా అభిమానానికి ఏనాడూ అడ్డు చెప్పలేదు. ఎప్పటికైనా కోహ్లీని కలవాలనేది నా కల'అని చెబుతుంది ఖుష్బూ. మొన్నటి న్యూజిలాండ్ సిరీస్ లో మూడో టెస్లు ఇండోర్ లో జరిగినప్పుడు కోహ్లీని కలిసేందుకు ఖుష్బూ ప్రయత్నించింది. కానీ విఫలమైంది. ఏదో ఒకరోజు ఆమె కల నెరవేరాలని కోరుకుందామా..

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా