9000 మందిని ఇంటికి పంపించేసిన ఇన్ఫీ!

20 Jan, 2017 16:02 IST|Sakshi
9000 మందిని ఇంటికి పంపించేసిన ఇన్ఫీ!
బెంగళూరు :  ఓ వైపు నుంచి ఆటోమేషన్ ప్రభావం, మరోవైపు నుంచి టాప్ కంపెనీ అయినా సరియైన ప్రదర్శన కనబర్చలేకపోవడం ఉద్యోగులకు ఎసరు తెచ్చి పెడుతోంది. గత ఏడాది కాలంలో దాదాపు 9వేల మంది ఉద్యోగులు ఆ కంపెనీ నుంచి బయటికి రావాల్సి పరిస్థితి వచ్చింది. ఇంతకి ఆ కంపెనీ ఏమిటా అనుకుంటున్నారా? దేశీయంగా నెంబర్.2 కంపెనీగా ఐటీ సర్వీసులు అందిస్తున్న ఇన్ఫోసిస్ సంస్థ. ఐటీ సేవల్లో బ్రాండెడ్ కంపెనీగా ముద్రపడిన ఇన్ఫోసిస్ గత ఏడాది కాలంగా 8000 నుంచి 9000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసినట్టు ఆ కంపెనీ హ్యుమన్ రిసోర్సస్ హెడ్ కృష్ణమూర్తి శంకర్ చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ ఉద్యోగులు మరింత అడ్వాన్డ్ ప్రాజెక్టులలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి క్వార్టర్లోనూ దాదాపు 2000 మందిని బయటికి పంపుతున్నామని, వారికి స్పెషల్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే కంపెనీ నుంచి తీసివేస్తున్నట్టు ఆయన చెప్పారు.
 
ఈ ట్రైనింగ్ ఉద్యోగులకు కొత్త అసైన్మెంట్లలో సహకరించనున్నట్టు శంకర్ తెలిపారు. ఆటోమేషన్ రంగం తీవ్రంగా విస్తరిస్తుందని, ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాల తగ్గిపోతున్నట్టు ఆయన వివరించారు. అయితే కేవలం ఆటోమేషను కాకుండా, అంచనాల మేర కంపెనీ రాణించలేకపోవడమేనని మరో కారణంగా ఎత్తిచూపారు. మొదటి తొమ్మిది నెలల కాలంలో ఇన్ఫోసిస్ కేవలం 5700 మందిని మాత్రమే నియమించుకుందని తెలిసింది. గతేడాది ఇదే కాలంలో 17వేల మందిని కంపెనీలో నియమించుకుంది. డిసెంబర్ క్వార్టర్లోనూ ఇన్ఫోసిస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. పెద్దపెద్ద ఐటీ సర్వీసుల కంపెనీలను ఆటోమేషన్ ప్రక్రియపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ సంప్రదాయ వ్యాపారాలు బీపీవో, అప్లికేషన్ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాక్ట్ర్చర్ మేనేజ్మెంట్ వాటిపై పెట్టుబడులను తగ్గిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంటోంది. 
 
మరిన్ని వార్తలు