ఇన్ఫీ సంక్షోభం : మళ్లీ బాంబు పేల్చిన మూర్తి

13 Feb, 2017 12:21 IST|Sakshi
ఇన్ఫీ సంక్షోభం : మళ్లీ బాంబు పేల్చిన మూర్తి
బెంగళూరు : ఇన్ఫోసిస్ ఫౌండర్ చైర్మన్ నారాయణమూర్తి మళ్లీ బాంబు పేల్చారు. ఇన్ఫోసిస్లో నెలకొన్న సంక్షోభానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టేందుకు బోర్డుతో మూర్తి సంధికి వచ్చినట్టు వస్తున్న రిపోర్టులను ఆయన ఖండించారు. తను లేవనెత్తిన ఆందోళనలపై వెనక్కి తగ్గేది లేదని మూర్తి ఉద్ఘాటించారు. ఇన్ఫోసిస్ సంక్షోభానికి ఫుల్ స్టాప్ చెబుదామనుకున్న మూర్తి, బోర్డుతో సంధికి వచ్చారని పలు రిపోర్టులు వచ్చాయి. బోర్డు సభ్యులు  కంపెనీ సమస్యలను, ఆందోళలను సరియైన రీతిలో పరిష్కరించాల్సిందేనని, వారు మంచి పారదర్శకతను అందించాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ చెప్పారు.
 
వారందరూ ఎంతో సమగ్రత కలిగి మంచి  ఉద్దేశ్యమున్న సభ్యులు, కానీ మంచి వ్యక్తులు కూడా ఏదో ఒక సందర్భంలో తప్పుచేస్తారని పేర్కొన్నారు. ఇలాంటి వాటిలో ఇదీ ఒకటి. మంచి నాయకత్వమంటే షేర్ హోల్డర్స్ ఆందోళనలన్నింటిన్నీ విని, సరియైన నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు.  దీనిపై బోర్డు సభ్యులు త్వరలో నిర్ణయం తీసుకుని కార్పొరేట్ పాలన మెరుగుపరిచి కంపెనీ భవిష్యత్ మంచిగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నట్టు చెప్పారు.  కానీ తాను లేవనెత్తిన ఆందోళనలపై మాత్రం సరియైన నిర్ణయం తీసుకునేంత వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు.  (చదవండి: ఇన్ఫీలో లుకలుకలకు ఫుల్ స్టాప్?)
 
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా