'టాప్-200 యూనివర్శిటీల్లో స్థానం దక్కకపోవడం బాధాకరం'

22 Oct, 2013 15:07 IST|Sakshi
'టాప్-200 యూనివర్శిటీల్లో స్థానం దక్కకపోవడం బాధాకరం'

షిల్లాంగ్: ఉన్నత విద్యలో విన్నూత్న మార్పులు  రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు.  ఉన్నత విద్యలో ఒకే విధమైన శైలిని అవలంభిచడం ఎంత మాత్రం సరికాదన్నారు. ప్రస్తుతం భారతీయ విద్యలో సమూలమైన మార్పులు తీసుకు రావాల్సిన ఆవశక్యత చాలా ఉందన్నారు. విద్యా సంస్థల్లో పని చేసే ప్రొఫెసర్లు, అధ్యాపకులు దీనిపై దృష్టి నిలపాలని ఆయన తెలిపారు. ప్రపంచ టాప్ -200 ర్యాంకింగ్ లో ఏ భారతీయ యూనివర్శిటీకి స్థానం లభించనందుకు తాను చింతిస్తున్నానని ప్రణబ్ తెలిపారు.
 

రాబోవు రోజుల్లో విద్యావిధానంలో మార్పులు తీసుకు రావడానికి యత్నించాలన్నారు. దేశంలోని యూనివర్శిటీల్లో ఆయా విభాగాలు ఖచ్చితమైన ప్రణాళికతో పనిచేయాలని ఆయన నొక్కి చెప్పారు.  ప్రపంచ యూనివర్శిటీలతో పోలిస్తే మన దేశంలోని ఉన్నత విద్య అంత పటిష్టంగా లేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. విదేశాల్లో అధ్యాపకునికి, విద్యార్థికి మధ్య ఉన్న మార్పిడి విధానాన్ని ఇక్కడ కూడా ప్రవేశపెడితే బాగుంటదన్నారు.

మరిన్ని వార్తలు