ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి

7 Aug, 2015 02:38 IST|Sakshi
ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి

మావోయిస్టు ఉద్యమ నేత కవితకు వరవరరావు నివాళి
 
హైదరాబాద్: మద్దెగూడలో జరిగిన భూటకపు ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ  జరిపించాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. జూలై 31న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా మద్దెగూడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కవితతో పాటు మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు. పొడియా బ్లాక్ డిప్యూటి కమెండర్‌గా వ్యవహరిస్తున్న కవిత.. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి డివిజన్‌లోని నాగమయ్యకుంటవాసి బండి రాములు, సుమిత్ర దంపతుల కుమార్తె. అయితే పోలీసులే కవితను చిత్ర హింసలకు గురి చేసి చంపార ని పౌర హక్కుల నేతలు ఆరోపిస్తున్నారు. వారం రోజుల క్రితం మృతి చెందిన కవిత మృతదేహాన్ని పోలీసులు ఎట్టకేలకు కుటుంబ సభ్యులకు అప్పగించారు.

వరవరరావు గురువారం కవిత భౌతికకాయానికి నివాళుల్పరించి మీడియాతో మాట్లాడారు. ఉద్యమనేత కవితకు గురువారం నాగమయ్యకుంటలో పలువురు మావోయిస్టు సానుభూతిపరులు నివాళులు అర్పించారు. వీరిలో అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అంజమ్మ, పద్మకుమారి, నర్సన్న, సీఎల్‌సీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, నారాయణ రావు, చైతన్య మహిళ సంఘం నాయకులు దేవేంద్ర, శిల్ప, సీఆర్‌పీపీ నాయకులు బల్లా రవీంధ్ర, దశరథ, డప్పు రమేష్ తదితరులు ఉన్నారు. అంబర్‌పేట శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.
 

>
మరిన్ని వార్తలు