ఇంటెల్ చేతికి నెర్వాణ సిస్టమ్స్

10 Aug, 2016 11:24 IST|Sakshi
ఇంటెల్ చేతికి నెర్వాణ సిస్టమ్స్

రానున్న కాలంలో ప్రపంచమంతా ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్గా మారబోతున్న తరుణంలో కంపెనీలన్నీ ఈ టెక్నాలజీస్పై ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయి.  ఈ నేపథ్యంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో దూసుకుపోయేందుకు, అమెరికాకు చెందిన చిప్ల తయారీ దిగ్గజం ఇంటెల్, ఏఐ స్టార్టప్ నెర్వాణ సిస్టమ్స్ను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. డేటా సెంటర్లలో ఇంటెల్ పాత్రను విస్తృతం చేయడానికి, ఇంటర్నెట్ అంశాలను విస్తరించుకోవడానికి ఈ స్టార్టప్తో డీల్ కుదుర్చుకుంటున్నట్టు మంగళవారం వెల్లడించింది. అయితే డీల్ ప్రకారం నెర్వాణ సిస్టమ్స్కు ఇంటెల్ ఏ మేరకు చెల్లించనుందో వివరించలేదు.

ఒప్పందంలో భాగంగా ఇంటెల్ 350 మిలియన్ డాలర్లకు పైగా(సుమారు రూ.2,333 కోట్లు) మొత్తాన్ని నెర్వాణ సిస్టమ్స్కు చెల్లించనున్నట్టు అమెరికా మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ కొనుగోలు డీల్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్లో ఇంటెల్ సంస్థనే ముందంజలో ఉంటుందని నెర్వానా సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ నవీన్ రావ్ తన బ్లాగ్లో పోస్టు చేశారు. దీంతో కంప్యూటింగ్లో ఇప్పటివరకు ఉన్న పాత రూపురేఖలకు స్వస్తి చెప్పి, కొత్త విధానంలో ముందుకు దూసుకెళ్తామని వెల్లడించారు.

రెండేళ్ల కిందట దక్షిణ కాలిఫోర్నియాలో వెలిసిన నెర్వాణ సిస్టమ్స్, హార్డ్వేర్, సాప్ట్వేర్లను కలుపుకుని మానవ మేథస్సు వల్లే ఆలోచించడానికి సాయపడటంలో తన ప్రత్యేకత చాటుకుంటోంది. ఎక్సియాన్, ఎక్సియాన్ ఫి చిప్స్ను మంచిగా హ్యాండిల్ చేయడం, ఇంటర్నెట్ క్లౌడ్లో లోతుగా అధ్యయనం చేయడం వంటి వాటి కోసం నెర్వాణకున్న నైపుణ్యాన్ని ఇంటెల్ ఉపయోగించుకోనుంది. 

మరిన్ని వార్తలు